
ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి వీఎల్-ఎస్ఆర్ సామ్‌ను భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందీపూర్ తీరంలోని ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్) నుంచి వెర్టికల్ (నిట్టనిలువు) పద్ధతిలో దీన్ని ప్రయోగించారు. ఈ పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), భారత నేవీ సంయుక్తంగా నిర్వహించాయి. వీఎల్-ఎస్ఆర్ అనేది షిప్ బార్న్ వెపన్ సిస్టం. ఇది సీ స్కిమ్మింగ్ లక్ష్యాలతో సమీప పరిధిలోని వైమానిక ముప్పులను న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ రోజు హై-స్పీడ్ ఏరియల్ టార్గెట్ అనుకరించే విమానానికి వ్యతిరేకంగా పరీక్ష నిర్వహించామని, అది విజయవంతమైందని డీఆర్డీవో తెలిపింది. ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




