Wednesday, 11 November 2026
న్యూస్ · April 23, 2022 · admin

నేడు టీఎస్‌పీఎస్సీ కీలక సమావేశం

ఉద్యోగ నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కమిషన్‌ చైర్మన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సభ్యులు, అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశంలో నోటిఫికేషన్లపై.. ముఖ్యంగా 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వివిధ కేటగిరీల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలపై టీఎస్‌పీఎస్సీ నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు సమావేశంలో తీసుకునే నిర్ణయంతో నోటిఫికేషన్లపై స్పష్టత రానుంది.