శంషాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్
admin July 7, 2022 0 COMMENTS
విమానాల మెయింటెనెన్స్, రిపేరీ రంగంలో అగ్రగామిగా ఎదిగిన సఫ్రాన్ కంపెనీ యూనిట్‌ను గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 1200 కోట్ల పెట్టుబడితో ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద ఎమ్మార్వో కేంద్రం ఇదేనని, మన దేశంలో ఓ విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ఇంజిన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనని తెలిపారు. ఎంఆర్ఐ ఫెసిలిటీ సెంటర్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సోషల్ మీడియా ట్విట్టర్ లో ..ఈ కంపెనీని హైదరాబాద్ తీసుకురావడానికి కేటీఆర్ ఎంతగానో శ్రమించారు. ఆ కంపెనీతో కేటీఆర్ 35 సార్లు భేటీ అయ్యారని రంజన్ తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, పారిస్‌లలో జరిగిన ఈ భేటీల్లో తెలంగాణ తరఫున కేటీఆర్ పాల్లొనగా… ఆయన వెంట రంజన్ కూడా పాలుపంచుకున్నారు.




