
ఓరుగల్లు కేంద్రంగా రాజ్యపాలన సాగించిన కాకతీయ రాజులు ప్రజల మెరుగైన జీవనం కోసం తెచ్చిన పథకాలు, చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ ఆదర్శనీయమే. గురువారం కాకతీయ వైభవ సప్తాహం ఉత్సావాలను ప్రారంభించేందుకు కమల్ చంద్ వరంగల్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో భంజ్‌దేవ్ ఇవాళ ఉదయం వరంగల్‌కు చేరుకుని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని భంజ్‌దేవ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. ఇక్కడ నుండి వెళ్ళినా బస్తర్‌లో సమాజసేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కాకతీయ ఉత్సవాలు జరపడం గర్వంగా ఉందని అన్నారు. కాకతీయ వంశ వారసునిగా ఓరుగల్లును సందర్శించే అవకాశం రానుండటం చూస్తుంటే తిరిగి నా తల్లి చెంతకు చేరుకున్నట్లు అనిపిస్తోంది. మాటల్లో చెప్పలేని ఆనందంతో మనస్సు నిండిపోయింది.తనను ఆహ్వానించిన నాయకులకు కమల్ చంద్ర భంజ్‌దేవ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
RELATED ARTICLES
Bestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.




