Wednesday, 11 November 2026
న్యూస్ · విద్య · May 12, 2022 · admin

తెలంగాణాలో 23 నుంచి పదో తరగతి పరీక్షలు..వెబ్ సైట్ లో హాల్‌టికెట్లు

రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను ఈరోజు నుంచి అందుబాటులో ఉంటాయని  ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.  ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో మొత్తం 5,08,275 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.