
గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లను ఆరు నెలల్లోగా క్లియర్ చేయాలని అమెరికా అధ్యక్ష సలహా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సిఫారసు చేయనుంది. ఈ సిఫారసుకు అధ్యక్షుడి ఆమోదం లభిస్తే.. అమెరికాలో శాశ్వత నివాస హోదాను కల్పించే గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయ అమెరికన్లకు మోక్షం లభించినట్టే అవుతుంది. భారతీయ అమెరికన్ నేత అజయ్ జైన్ భుటోరియా నేతృత్వంలోని బృందం ఈ ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనకు 25 మంది కమీషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.ప్రతీ దేశానికి ఏడు శాతం కోటా పరిమితి విధించారు. దీంతో చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం చాన్నాళ్లుగా వేచి చూస్తున్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




