Monday, 23 November 2026
న్యూస్ · May 17, 2022 · admin

నాటోలోకి స్వీడన్‌

నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్‌ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్‌ ప్రధాని మగ్డలీనా అండర్సన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. నాటోలో చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ దేశంపై రష్యా సైనిక చర్యలను ప్రారంభించింది. మరో వైపు యుద్ధాన్ని సైతం లెక్క చేయకుండా పలు దేశాలు నాటోలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి.ఫిన్లాండ్‌, స్వీడన్‌ నాటోలో చేరికకు దరఖాస్తు చేయడం..రెండు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ‘తీవ్ర తప్పిదం’గా రష్యా అభివర్ణించింది.