Friday, 23 October 2026
న్యూస్ · పర్యావరణం · September 17, 2022 · admin

కూనో పార్క్‌లో 8 చీతాల‌ ఫొటోలు తీసిన ప్ర‌ధాని మోదీ

న‌మీబియా నుంచి తెచ్చిన 8 చీతాల‌ను ఇవాళ ప్ర‌ధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని కూనో పార్క్‌లో ఈ ఉద‌యం అభయారణ్యంలో విడుదల చేశారు. ప్ర‌ధాని మోదీ తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చీతాలను ఎన్‌క్లోజర్ల నుంచి నేష‌న‌ల్ పార్కులోకి వ‌దిలి స్వేచ్ఛ కల్పించారు. అక్కడే ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించారు. మన దేశంలో గతంలో ఆసియాటిక్ చిరుత పులులు ఉండేవి. అయితే ఇవి అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 70 ఏళ్ళ తర్వాత ఈ జాతిని పునరుద్ధరించడం కోసం బోయింగ్  బి747 జంబోజెట్ విమానంలో న‌మీబియా నుంచి 8 చీతాలను గ్వాలియర్ తీసుకొచ్చారు.  వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫ‌ర్ జాకెట్‌, హ్యాట్‌, క‌ళ్ల జోడు పెట్టుకున్న మోదీ వాటిని ఫొటోలు తీశారు.