
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరు ఊరుకో జమ్మి చెట్టు-గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కలిసి జమ్మి మొక్కను నాటారు. జోగినపల్లి సంతోష్ కుమార్ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న కీసర అభయారణ్యంలోని పెద్దమ్మ చెరువు పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే వివేకానంద, జడ్పి చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




