Wednesday, 11 November 2026
విద్య · October 11, 2021 · admin

పదోతరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ ఏడాది టెన్త్‌లో 11 పేపర్లకు బదులు  ఆరు పేపర్లతో పరీక్షలు ఉండనున్నాయి. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఒక్కో స‌బ్జెక్టుకు ఒక్కో పేప‌రే ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.అలాగే హిందీతోపాటు.. ఉర్దూను ద్వితీయ భాషగా ఉత్తర్వుల్లో పేర్కొంది.  కోవిడ్‌ నేపథ్యంలో నెలకొన్ని పరిస్థిల కారణంగా విద్యార్థులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేర‌కు ప‌ది ప‌రీక్ష‌ల విధానంపై విద్యాశాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్త‌ర్వులు జారీ చేశారు.