
తెలంగాణ ఈ-సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.ఈసెట్-2021 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదలచేశారు.ఈసెట్లో 95.16శాతం మంది అభ్యర్థలు ఉత్తీర్ణత సాధించారు.ఆగస్టు 3న జరిగిన ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు సుమారు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల తమ ర్యాంకు కార్డులను https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఈ నెల 24 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే 26 నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.ఈ నెల 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. వారికి సెప్టెంబర్ 2న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 13న తుది విడత ప్రవేశాల షెడ్యూలు ప్రారంభం కానుంది. సెప్టెంబరు 14న తుది విడత ధృవపత్రాల పరిశీలన తర్వాత సెప్టెంబరు 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 17న తుది విడత ఈసెట్ సీట్లను కేటాయిస్తారు.
RELATED ARTICLES
Bestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.




