తెలంగాణలో స్టాడ్లర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ రూ. వెయ్యి కోట్ల పెట్టుబడికి ఒప్పందం
admin May 25, 2022 0 COMMENTS
దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్ (KTR) సమక్షంలో ప్రభుత్వంతో స్టాడ్లర్ రైల్ కంపెనీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఉన్న మేధో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నాయి. దీంతో తెలంగాణలో 2500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రూ.1000కోట్లతో స్టాడ్లర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




