
నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను ఇవాళ ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని కూనో పార్క్‌లో ఈ ఉదయం అభయారణ్యంలో విడుదల చేశారు. ప్రధాని మోదీ తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చీతాలను ఎన్‌క్లోజర్ల నుంచి నేషనల్ పార్కులోకి వదిలి స్వేచ్ఛ కల్పించారు. అక్కడే ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించారు. మన దేశంలో గతంలో ఆసియాటిక్ చిరుత పులులు ఉండేవి. అయితే ఇవి అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 70 ఏళ్ళ తర్వాత ఈ జాతిని పునరుద్ధరించడం కోసం బోయింగ్ బి747 జంబోజెట్ విమానంలో నమీబియా నుంచి 8 చీతాలను గ్వాలియర్ తీసుకొచ్చారు. వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్ జాకెట్, హ్యాట్, కళ్ల జోడు పెట్టుకున్న మోదీ వాటిని ఫొటోలు తీశారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




