
తెలంగాణలో ఇద్దరు ఒమిక్రాన్ కేసుల బాధితులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఈ రోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు తెలిపారు.ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు అని తెలిపారు.ఇద్దరిని టిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. కెన్యా జాతీయురాలి వయసు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశస్థుడి వయసు 23 ఏండ్లు అని పేర్కొన్నారు. 12వ తేదీనే వీరిద్దరి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్స్‌కు పంపామని, నిన్న రాత్రి ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఎవరికీ కరోనా సోకలేదు. తెలంగాణలో ప్రస్తుతానికి రెండు యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




