
న్యూ ఇయర్ కానుకగా అతిపొడవైన ఆరు లైన్ల షేక్ పేట్ ప్లై ఓవర్ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. శనివారం ఉదయం 11 గంటలకు షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రూ.333.55 కోట్లతో 2.71 కిలోమీటర్లు మేర ఫ్లైఓవర్ నిర్మించారు. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి, ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులకు, ఐటీ ఉద్యోగులకు దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 2018లో షేక్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మూడేళ్లలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తైంది.గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్లు నగర రూపురేఖల్నే మార్చివేశాయి. ముఖ్యంగా SRDP కింద చేపట్టిన పనులు ఎలాంటి నిధుల కొరత లేకుండా జరగడమే అందుకు కారణం.
RELATED ARTICLES
LEAVE A COMMENT




