Tuesday, 17 November 2026
న్యూస్ · June 6, 2023 · admin

కుల‌వృత్తులు, చేతివృత్తుల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం ఆన్లైన్ లో ద‌ర‌ఖాస్తుల‌ స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులు, చేతివృత్తుల‌నే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గ‌త నెల‌లో జ‌రిగిన‌ కేబినెట్‌లో నిర్ణయించింది. ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ నెల 9న కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో రూ.1 లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభిస్తారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలచే లబ్ధిదారులకు రూ.1 లక్ష పంపిణీ చేయనున్నారు. ఫొటో, ఆధార్, ఆదాయధ్రువీకరణ పత్రం, కులధ్రువీకరణ పత్రం సహా 38 కాలమ్ లతో అప్లికేషన్ ను వెంటనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. కృలవృత్తి, చేతివృత్తులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు సాయం చేయనుంది.