రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌లు సైతం ఓటు వేశారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ నెల […]
READ MOREనిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ఇప్పటికే నిండిపోయింది. దీంతో ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఆనకట్ట పైనుంచి వరద ప్రవహిస్తున్నది. అప్పటికప్పుడు మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. ఒక గేటు మొరాయించడంతో వదిలేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, వరద […]
READ MOREతెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 18న సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. మొత్తంగా వర్షాల కారణంగా […]
READ MOREకుండపోత వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే ఈనెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎంసెట్ ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. వాగులు, వంకలు పొంగుతున్న […]
READ MOREఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఎమర్జెన్సీ కోసం DRF టీమ్స్ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈనెల 8 నుంచి గ్రేటర్‌లో వర్షం పడుతూనే ఉంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తేలికపాటి జల్లులు పడినప్పటికీ.. సాయంత్రం 5 గంటల తర్వాత మోస్తరు వర్షం పడింది. వర్షాల నేపథ్యంలో చాలామంది మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో వివిధ మార్గాల్లో నడిచిన […]
READ MOREఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం 53.90అడుగులకు పెరిగింది. అధికారులు సోమవారం సాయంత్రానికే మూడవ ప్ర మాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరితోపా టు దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సమీప మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మధ్య […]
READ MOREశంషాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్
admin July 7, 2022 0 COMMENTSవిమానాల మెయింటెనెన్స్, రిపేరీ రంగంలో అగ్రగామిగా ఎదిగిన సఫ్రాన్ కంపెనీ యూనిట్‌ను గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 1200 కోట్ల పెట్టుబడితో ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద ఎమ్మార్వో కేంద్రం ఇదేనని, మన దేశంలో ఓ విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ఇంజిన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనని తెలిపారు. ఎంఆర్ఐ ఫెసిలిటీ సెంటర్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. […]
READ MOREఓరుగల్లు కేంద్రంగా రాజ్యపాలన సాగించిన కాకతీయ రాజులు ప్రజల మెరుగైన జీవనం కోసం తెచ్చిన పథకాలు, చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ ఆదర్శనీయమే. గురువారం కాకతీయ వైభవ సప్తాహం ఉత్సావాలను ప్రారంభించేందుకు కమల్ చంద్ వరంగల్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో భంజ్‌దేవ్ ఇవాళ ఉదయం వరంగల్‌కు చేరుకుని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని భంజ్‌దేవ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. ఇక్కడ […]
READ MOREరాష్ట్ర ప్రభుత్వం ఎంతో మందికి విద్యను అందిస్తున్న గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సిఎం అన్నారు. పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణ చర్యలు […]
READ MOREబల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. కల్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.
READ MORE










