
టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.టీ వర్క్స్ ద్వారా అనేక ప్రోటో టైప్స్ రూపొందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో మెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్‌లో 3డీ ప్రింటింగ్‌పై జరిగిన జాతీయ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు.3డీ ప్రింటింగ్ ఆరోగ్య విభాగంలో చాలా ఉపయోగపడుతుందన్నారు. ఆర్థోపెడిక్, డెంటల్ విభాగాల్లో 3డీ ప్రింటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు భారత్‌కు చక్కటి అవకాశముందన్నారు.ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న నేషనల్ సెంటర్ ఫర్ అడిట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్‌తో ఈ రంగంలో దేశం పురోగతి సాధిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




