
ఆశావర్కర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి నెలవారిగా ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎన్‌హెచ్‌ఎం కింద పని చేస్తున్న ఆశా కార్యకర్తలకు ఈ పెంపు వర్తించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నెలవారీ ప్రోత్సాహకాలు రూ. 7500 నుంచి రూ. 9750కి పెరగనున్నాయి. ఈ ఉత్తర్వులతో ఆశా వర్కర్ల నెలవారీ జీతం 2,250 పెరిగింది. పెంచిన ఇన్సెంటీవ్స్‌ని గతేడాది జూన్ నెల నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




