Wednesday, 11 November 2026
విద్య · January 5, 2022 · admin

ఇంటర్ పరీక్ష ఫీజుల తేదీలు ఖరారు.

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కు సంబంధించిన పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్​ బోర్డు ఖరారు చేసింది. ఈ రోజు (బుధవారం) నుంచి ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని  తెలిపింది. ఫైన్‌ తో ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు అధికారులు. సర్కారు అనుమతి ఇవ్వగానే షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ఇటీవల ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్​మెంట్ రాసుకోవచ్చునని స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్  వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.