
జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను మంత్రి కెటిఆర్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం జాంప్ ఫార్మా ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా తర్వాత హైదరాబాద్‌లో జాంప్ హైదరాబాద్‌లోనే పెద్ద బ్రాంచ్‌ను ప్రారంభించిందని పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందన్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్ జీనోమ్ వ్యాలీకి దగ్గరలో రానున్నాయి. గ్లోబల్ వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో హైదరాబాద్ వాటా 33శాతం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అద్భుతమైన సహకారం అందిస్తుందన్నారు. 28 రోజుల్లోనే జాంప్ ఫార్మాకు భూమిని కేటాయించామన్నారు. బీ-హబ్ నిర్మాణంతో పాటు జీనోమ్ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. త్వరలో బీ-హబ్‌ను ప్రారంభించి, బయోలాజికల్ పరిశోధనలకు తోడ్పాటునందించబోతున్నామని మంత్రి కెటిఆర్ ప్రకటించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




