
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు.రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వచ్చారు. మీడియాకు అభివాదం చేస్తూ సీఎం లోపలికి వెళ్లారు. 2019 లో ఏర్పాటైన రాష్ట్ర హై కోర్టు మొట్ట మొదటి ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎన్ రాధాకృష్ణన్ పని చేశారు. తర్వాత జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ హిమ కోహ్లి, ప్రధాన న్యాయమూర్తులుగా సేవలందించారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్‌చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకరానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
RELATED ARTICLES
Bestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.




