
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. 97 శాతం ఓట్లను లెక్కించగా మాక్రాన్‌కు 58% ఓట్లు రాగా, పెన్‌కు 42% ఓట్లు పడ్డాయి. గడిచిన 20 ఏండ్ల కాలంలో వరుసగా రెండు సార్లు అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్ రికార్డు సృష్టించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మాక్రాన్ కు శుభాకాంక్షలు తెలిపారు.భారత్, ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేసేందుకు మరోసారి కలిసి పనిచేద్దామన్నారు ప్రదాని మోడీ. మాక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




