
రాష్ట్రంలో కోవిద్ -19 తో మృతిచెందిన వారి అర్హులైన సమీప కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారికి రూ.50వేల చొప్పున పరిహారాన్ని అందించాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరడం తెలిసిందే. కోవిద్-19 తో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో రాష్ట్రంలోని 4500 మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణా శాఖ తెలిపింది. మీ సేవా కేంద్రం ద్వారా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కరోనాతో మృతి చెందినట్టు తెలియజేసే కరోనా పాజిటివ్ పరీక్షా నివేదిక పత్రం, ఆధార్ కార్డు వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




