సిద్దిపేట జిల్లాలో కోకాకోలా సంస్థ రూ. 1,000 కోట్ల పెట్టుబడులు : మంత్రి కేటీఆర్
admin April 7, 2022 0 COMMENTS
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ నేడు నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో రూ. 600 కోట్ల పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. నూతన పరిశ్రమ కోసం ఇక్కడ 48.53 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కోకాకోల సంస్థ 25 ఏళ్లుగా సేవలందిస్తోందని కేటీఆర్ చెప్పారు. మహిళలకు అత్యధికంగా ఉపాధి కల్పిస్తామని హిందూస్థాన్ కోకోకోలా వెల్లడింది. కొత్త పరిశ్రమ ద్వారా దాదాపు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అంతేగాక, కోకాకోలా కంపెనీ భవిష్యత్లో మరో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని వివరించారు.ప్రపంచ స్థాయి కంపెనీలకు తెలంగాణ కేంద్రం అవుతోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




