
ఆదివాసీ, బంజారా భవనాలు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని రోడ్‌నెం.10లో ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించారు. ఈ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రూ.50 కోట్ల నిధులను ఖర్చుచేసింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఈ రోజు ఈ భవనం తనతో ప్రారంభింపజేసుకున్నందుకు తెలంగాణ గిరిజన బిడ్డలందరికీ హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది భారతదేశ గిరిజనులకు అంతా స్ఫూర్తి అన్నారు. గిరిజనుల ఎన్నో సమస్యలకు పరిష్కారం కావాలన్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులకు సమానహోదా రావాలని కెసిఆర్ తెలిపారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




