అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ‘భూదాన్ పోచంపల్లి’ ఐక్యరాజ్యసమితి గుర్తింపు
admin November 16, 2021 0 COMMENTS
తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అధికారికంగా ప్రకటించింది. భారతదేశం నుంచి 3 గ్రామాలు పోటీ పడగా భూదాన్ పోచంపల్లి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది.ఈ అవార్డు కోసం భారత్ నుంచి మేఘాలయలోని కోంగ్‌తాంగ్, మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పురా ఖాస్, తెలంగాణలోని పోచంపల్లి గ్రామాలను కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ 24వ సెషన్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేయనున్నారు. భూదాన్ పోచంపల్లికి సిల్క్ సిటీగా ప్రత్యేక గుర్తింపు ఉంది.




