
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా రణిల్ ను శ్రీలంక పార్లమెంటు ఎన్నుకుంది. 221 ఓట్లకు గాను 134 ఓట్లు విక్రమసింఘేకు వచ్చాయి. అయన ప్రధాన ప్రత్యర్థి దులాస్ అలహప్పెరుమకు 82 ఓట్లు లభించగా.. లెఫ్టిస్ట్ అనురా దిసానాయకు కేవలం మూడు ఓట్లు మాత్రమే. మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి వెళ్తూ ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. శ్రీలంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. ఈరోజు జరిగిన ఓటింగ్‌లో విక్రమ సింఘేకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. 6 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన విశేష అనుభవం రణిల్ విక్రమసింఘేకి ఉంది.
RELATED ARTICLES
LEAVE A COMMENT




