
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఎమర్జెన్సీ కోసం DRF టీమ్స్ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈనెల 8 నుంచి గ్రేటర్లో వర్షం పడుతూనే ఉంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తేలికపాటి జల్లులు పడినప్పటికీ.. సాయంత్రం 5 గంటల తర్వాత మోస్తరు వర్షం పడింది. వర్షాల నేపథ్యంలో చాలామంది మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో వివిధ మార్గాల్లో నడిచిన రైళ్లు కిటకిటలాడాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని, ప్రజలు అత్యవసర పనులకు మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




