టర్కీలో తుది శ్వాస విడిచిన హైదరాబాద్ ఎనిమిదవ నిజాం ముకర్రంజా బహదూర్
admin January 17, 2023 0 COMMENTS
హైదరాబాద్ 8వ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముఖరం జా బహదూర్ టర్కీ ఇస్తాంబుల్ లోని తన నివాసంలో 90 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. ముకర్రంజా బహదూర్ భౌతికకాయాన్నినేడు హైదరాబాద్‌కు తరలించనున్నారు. ప్రత్యేక విమానంలో ముకర్రంజా భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్ ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మక్కా మసీదులోని ఆసిఫ్ జాహీ టూంబ్స్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి. ముకర్రం ఝా అసలు పేరు.. భర్కత్ అలీ ఖాన్. ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజాం ఝా, టర్కీ చివరి సుల్తాన్ అబ్దుల్ మేజీద్-2 కుమార్తె దురు షెహవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న ముకర్రం ఝా జన్మించారు. ఏడవ నిజాం మరణించిన తరువాత, ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారసుడైన ముకర్రం జాకు భారత ప్రభుత్వం 1967న చౌమహల్లా ప్యాలెస్‌లో పట్టాభిషేక వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా ముకర్రం జాను హైదరాబాద్ ఎనిమిదవ నిజాంగా అధికారికంగా ప్రకటించారు.
RELATED ARTICLES
Bestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.




