
దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. గడచిన 24 గంటల్లోనే 17,073 కొవిడ్ కేసులు నమోదవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఆదివారం విడుదలైన బులిటెన్ లో 15,940 కేసులు వచ్చాయని తెలిపింది. దాంతో ఒక్క రోజులోనే కొత్త కేసుల సంఖ్య వెయ్యికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం 94,420 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,208 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఆదివారం ఒక్కరోజే 11,739 కేసులు నమోదయ్యాయి.21 మంది కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల 5,25,020 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఒక్క రోజే 2,49,646 డోసులు దేశ వ్యాప్తంగా పంపిణీ చేశారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




