
దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతోంది. కొత్తగా 13,216 మంది వైరస్ బారినపడ్డారు.ఇదే సమయంలో 8,148 మంది కరోనా నుంచి కోలుకోగా… 23 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 4,32,83,793కు చేరుకున్నాయి.దేశ వ్యాప్తంగా 5,24,840 మంది మృత్యువాతపడ్డారు. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,148 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,90, 845కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96, 00,42,768 మందికి కరోనా వ్యాక్సిన‍్లను అందించినట్టు కేంద్రం తెలిపింది.
RELATED ARTICLES
LEAVE A COMMENT




