
దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ.500 కోట్ల నిధులు విడుదల చేసింది. తొలివిడతగా ఇప్పటికే 500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుకు మొత్తం రూ.1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.2వేల కోట్ల విడుదల చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు.తెలంగాణ దళితబంధు పేరుతో లబ్ధిదారుల పేరిట ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు తెరవాలని నిర్ణయించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




