
టీఎస్ ఎంసెట్( TS EAMCET ) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. నీట్, TSPSC పరీక్షల కారణంగా ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT



