Friday, 23 October 2026
పర్యావరణం · March 21, 2023 · admin

పర్యావరణ అభివృద్ధికి అడవులే ప్రధాన కారణం : ఎంపీ సంతోష్‌ కుమార్‌

నేడు ప్రపంచ అటవీ దినోత్సవం (World Forest Day ) సందర్భంగా ..ప్రపంచంలోని 80శాతం భూ జీవవైవిధ్యానికి అడవులే ప్రధాన కారణమని ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ట్విటర్లో ట్వీట్‌ చేశారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో దోహదపడతాయి.   అడవులు లేకపోతే ఈ భూమి ఓ నిర్జీవంతో సమానం.  తెలంగాణ ప్రభుత్వం అడవుల రక్షణ, పెంపకంపై ‘హరితహారం’ (HarithaHaaram) కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పార్కులకు పునర్జీవంపోసిన ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారితోనే ఇది సాధ్యమైందని ఆయన ట్వీట్టర్ వేదికగా తెలియజేశారు.