
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ నియమితులయ్యారు. ఇటీవల ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగిన లిజ్ ట్రస్ విధ్వంసకర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రిషి మంగళవారం ఆ పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. గత 210 ఏండ్లలో బ్రిటన్ పాలనా పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు. ప్రధాని హోదాలో తొలి ప్రసంగం వెలువరించారు. 2019లో కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారంటే అది ఏ ఒక్క వ్యక్తి ఘనతగానో, ఏ ఒక్క వ్యక్తి సొంతం అనో భావించరాదు. అది అందరికీ సంబంధించిన, అందరినీ ఏకం చేసే విజయం. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానని, కన్జర్వేటివ్ పార్టీని సమైక్యపరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు ఎంత కఠినమైనవో నాకు తెలుసు. ప్రజల నమ్మకం పొందడానికి ఎంతో శ్రమించాల్సి ఉందని నాకు అర్థమైంది. 2015లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన రిషి సునాక్ కేవలం ఏడేండ్లలోనే ప్రధాని పీఠాన్ని చేరుకొన్నారు. బ్రిటన్కు 57వ ప్రధానమంత్రిగా రిషి తొలి ప్రసంగం.. మెరుగైన విద్యా వ్యవస్థ, శాంతిభద్రతలు, సరిహద్దుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, సాయుధ దళాలకు మద్దతు, సంక్షేమం, బ్రెగ్జిట్ నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకుని బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగంలో ఉపాధి కల్పన కోసం పాటుపడతాను అంటూ రిషి సునాక్ ప్రసంగించారు.




