
రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను ఈరోజు నుంచి అందుబాటులో ఉంటాయని ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో మొత్తం 5,08,275 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




