
రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం కోవిడ్ రూల్స్ పాటిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్న సబిత.. గ్రామపంచాయతీ, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పక్కాగా శానిటేషన్ చేపడుతున్నామన్నారు. ధైర్యంగా పిల్లల్ని స్కూళ్లకు పంపొచ్చని భరోసా ఇచ్చారు.బుధవారం హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. స్కూళ్లల్లో పారిశుధ్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు.60 లక్షల మంది విద్యార్థుల్లో 20 లక్షల మంది ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారన్నారు. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్‌లో అదనంగా లక్ష మంది జాయిన్ అయ్యారని అన్నారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 2.5 లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయన్నారు.రెసిడెన్షియల్ తప్ప మిగతా పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశించామని.. కొత్తగా లక్షా ఇరవై వేల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు.రాజ్ భవన్ ప్రభుత్వ స్కూల్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సందర్శించారు.పిల్లలను ధైర్యంగా స్కూళ్లకు పంపిన తల్లిదండ్రులను అభినందించిన గవర్నర్… పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్లదేనన్నారు.




