
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్‌ఆర్టిసి) మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా విసి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు.సజ్జనార్‌ను కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసి.. నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు.వారం రోజుల క్రితం సజ్జనార్‌ను తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సజ్జనార్ గతం లో సీఐడీ, ఇంటిలిజెన్స్ విభాగాలలో పనిచేశారు.సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
RELATED ARTICLES
LEAVE A COMMENT




