
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం మరోసారి వాయిదాపడింది. ఏపీ సభ్యుల ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలో శుక్రవారం మొదలైన ఈ సమావేశానికి తెలంగాణ ప్రతినిధి బృందం హాజరైనా… ఏపీ ప్రతినిధుల కోసం కాసేపు వేచి చూసిన బోర్డు, వారి జాడ లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసింది. ఏపీ సభ్యుల గైర్హాజరుతో మార్చి 11న కూడా భేటీ వాయిదా పడింది. ఈ సమావేశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి బోర్డునుంచి ముందుగానే సమాచారం వెళ్లింది. వరుసగా రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వారు హాజరుకాలేదు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




