
కేరళకు చెందిన వస్త్ర తయారీ పరిశ్రమ కైటెక్స్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెడుతోంది. వరంగల్‌లోని కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి సీతారామ్‌పూర్‌లో ప్లాంటు ఏర్పాటుకు కైటెక్స్ సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పి. సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం జాకబ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన కైటెక్స్ గ్రూప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూ. 2,400 కోట్ల పెట్టుబడి పెట్టాలని కైటెక్స్ గ్రూప్ నిర్ణయించిందని తెలిపారు. దీంతో 22 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో 18 వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుంది.
RELATED ARTICLES
Bestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.




