
తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.హైదరాబాద్‌తోపాటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడి వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లో తెల్లవారుజామున ప్రారంభమైన వాన గంటపాటు దంచికొట్టింది. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. యాదగిరిగుట్టలో భారీ వర్షానికి ఘాట్ రోడ్డు కుంగిపోయింది. దీంతో కొండపైకి రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల కుంగిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కాంట్రాక్టర్లు, అధికారుల పనితనంపై భక్తులు మండిపడుతున్నారు. ఒక్క వర్షానికే యాదాద్రి అభివృద్ధి పనుల్లో అధికారుల వైఫల్యం కనపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




