
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వార్షిక క్రైమ్ రేటు నివేదికను డిజిపి మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ.. తెలంగాణ పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. కరోనా సంక్షోభం సమయంలో పోలీసులు ఎంతో బాధ్యతాయుతంగా పని చేశారని, ప్రజలను చైతన్యవంతం చేశారని చెప్పారు.సిసి ఫుటేజీలతో అనేక కేసులను ఛేదించామని, డయల్ 100కు 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. షీ టీమ్స్‌కు 5145 ఫిర్యాదులు స్వీకరించి భరోసా కల్పించామన్నారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు రాష్ట రహిత రాష్టంగా పోలీస్ శాఖ సఫలీకృతం అయిందన్నారు. 2021 సంవత్సరంలో రాష్ట్రంలో మావోయిస్టులు అడుగులు పెట్టకుండా కఠిన చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ ఏడాది 98 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, 133 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని వెల్లడించారు. దీని కోసం ఇంటెలిజెన్స్‌ని ఏర్పాటు చేసి, నేరగాళ్ల డేటా ఒకే పోర్టల్‌లో ఉంచడంతో ఇతర రాష్ట్రాలు కూడా నిందితులను గుర్తించేలా చేశామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.



