
తెలంగాణ సర్కారు ఎడ్ సెట్ షెడ్యూల్ ప్రకటించింది. జులై 26, 27 తేదీల్లో ఎడ్ సెట్ నిర్వహించనున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్–2022కు ఈ నెల 7 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. వివరాలకు https://edcet.tsche.ac.in, http://www.tsche.ac.in వెబ్సైట్లను చూడవచ్చు.జనరల్ అభ్యర్థులు రూ.650, ఎస్సి, ఎస్టిలు రూ .450 చెల్లించాలన్నారు. రూ.250 ఆలస్య రుసుంతో జులై 1 వరకు రూ. 500 ఆలస్య రుసుంతో జులై 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఎడ్‌సెట్ పరీక్ష రాయవచ్చని అన్నారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ -ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు
రూ. 500 పెనాల్టీతో -జూలై 1 వరకు
ఫీజు వివరాలు -రూ. 650 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ. 450)
పరీక్ష తేదీలు -జూలై 26, జూలై 27
RELATED ARTICLES
LEAVE A COMMENT



