
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. వారి సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు. అనంతరం సభను 12వ తేదీకి వాయిదా వేశారు. తమ శాఖలకు చెందిన నివేదికలను విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి, పర్యాటక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభ వాయిదా అనంతరం స్పీకర్ చాంబర్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండా, సభ నిర్వహణ తేదీలను ఖరారు చేస్తారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




