
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై కీలక తీర్పును సీజేఐ యు.యు.లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించింది. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని.. సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పర్దివాలా, జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేదిలు ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించారు.జస్టిస్ లలిత్, భట్‌లు కోటాను వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని 103వ సవరణను సుప్రీం స్వాగతించింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అమలుకు సుప్రీం పచ్చజెండా ఊపింది.అగ్రవర్ణ పేదలకు కోటా ఇవ్వడం చట్ట వ్యతరేకం కాదని, రాజ్యాంగం కల్పించిన 50 శాతం సీలింగ్ పరిమితిని కూడా ఉల్లంఘించడం లేదని కోర్టు తెలిపింది. 2019 జనరల్ ఎన్నికల ముందు ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రభుత్వం తీసుకువచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లను కల్పించింది.




