
అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్.. ఇప్పుడు గూగుల్. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ నగరం శాశ్వత కూడలి అవుతున్నది.హైదరాబాద్‌లో దశాబ్ద కాలం పాటు ఒక ల్యాండ్ మార్క్‌గా నిలవబోయే ఈ క్యాంపస్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఈ కొత్త ఆఫీసును 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్ నిర్మించబోతోంది. డిజిటల్ తెలంగాణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం మరో ముందడుగు పడిందని రాష్ట్ర మంత్రి కెటిఆర్ తెలిపారు. కార్యాలయ ఏర్పాటుకు ముందుకొచ్చిన గూగుల్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.అమెరికాలోని మౌంటెన్‌వ్యూలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయం తరువాత హైదరాబాద్ క్యాంపసే అతి పెద్దది. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




