
యాదాద్రి కలెక్టరేట్లో ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో 22 కొత్త ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్స్ మంజూరయ్యాయని, అందులో 20 పూర్తి కాగా రెండు తుది దశలో ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. గరుడ యాప్ ద్వారా బూత్ లెవల్ పని చేసేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.రాష్ట్రంలో ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. సవరణ కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెరిఫికేషన్‌కు బిఎల్వోలు వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించాలని శశాంక్ గోయల్ అన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




