
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వైద్యాధికారులతో ఆరోగ్య మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని వైద్య అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా మందులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




