
ప్రముఖ నేపథ్య గాయిని హరిణి కుటుంబం అదృశ్యమైంది. వారం రోజుల నుంచి హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. వారి ఫోన్లు కూడా స్విచాఫ్ అయ్యాయి. వారం రోజులుగా హైదరాబాద్ లోని వారి ఇంటికి తాళం పెట్టి ఉంది. బంధువులు ఎంత ట్రై చేసినా వారి ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో అనుమానస్పద స్థితిలో హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది. బెంగళూరులోని రైల్వేట్రాక్‌పై ఏకే రావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఏకే రావు శరీరంపై కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. సుజనా ఫౌండేషన్ సీఈవోగా పనిచేస్తున్న ఏకే రావు కుటుంబం శ్రీనగర్ కాలనీలో నివాసముంటుంది. ఈనెల 22న బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన కనిపించడంలేదంటూ కేసు నమోదైంది. 23 న ఏకే రావు మృతి చెందినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బెంగుళూరులోనే మృతుడి అంతక్రియలు పూర్తి చేశారు.




